చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తస్మున్నీసా అనే గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. తహసీల్దార్ కార్యాలయం పైనుంచి దూకింది. తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికులు బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వాలంటీర్ ఆత్మహత్యాయత్నం.. ఇళ్ల స్థలాల్లో అక్రమాలే కారణం! - మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం
ఇళ్ల స్థలాల్లో అవినీతి కారణంగా చిత్తూరు జిల్లాలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అయితే వారి నుంచి సరైన సమాధానం రాలేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది.

volunteer suicide attempt
బాధితురాలు తస్మున్నీసా బి.కొత్తకోట బీసీ కాలనీలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇళ్ల స్థలాల జాబితాలో అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అధికారుల నుంచి సమాధానం లేకపోవడం, ప్రతిపాదిత లబ్ధిదారులు ప్రశ్నిస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిందని సమాచారం.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్