తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మహిళ అనుమానాస్పద మృతి.. భర్తపై బంధువుల ఫిర్యాదు - కుటుంబ కలహాలతో మహిళ మృతి

పురుగుల మందు తాగి వివాహిత మృతి చెందిన ఘటన మెదక్​ జిల్లా చిన్న శంకరంపేట మండలం చెన్నయిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త హత్య చేసినట్టు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

women suspectious death in chennaipally medak sidtrict
మహిళ అనుమానస్పద మృతి.. భర్తపై బంధువుల ఫిర్యాదు

By

Published : Jun 14, 2020, 6:28 PM IST

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చెన్నయిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసినట్టు మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నయిపల్లికి చెందిన అత్తిలి మల్లేశానికి 20 ఏళ్ల క్రితం నార్సింగి మండలం వల్లభాపూర్​కు చెందిన బుజ్జితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం ఆమె అనారోగ్యం బారిన పడింది. దీంతో మల్లేశం మరో వివాహం చేసుకున్నాడు. ఎప్పడూ గొడవపడుతుండటం వల్ల కొన్నేళ్ల క్రితం బుజ్జి తల్లిగారింటికి వెళ్లింది.

రెండేళ్ల క్రితం ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి తిరిగి బుజ్జి భర్త దగ్గరకు వచ్చింది. ఏమైందో ఏమో బుజ్జి పురుగుల మందు తాగిందని కుటుంబ సభ్యులకు ఫోన్​ చేశారు. మృతురాలి బంధువులు చెన్నయిపల్లికి చేరుకునేలోపే... శవమై కనిపిందని ఆరోపిస్తున్నారు. మృతురాలి మెడ, తొడ భాగంలో తీవ్రంగా గాయాలు ఉన్నాయని, వేరే వ్యక్తులతో కలిసి భర్త మల్లేశం దారుణంగా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్​ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:పెళ్లైన 24 గంటల్లోనే.. మరో పెళ్లి చేసుకున్న యువతి

ABOUT THE AUTHOR

...view details