జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లయ్యపల్లిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన కిన్నెర వైష్ణవి(28)కి చిరంజీవితో 2010లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ కలహాలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం వైష్ణవి తన పిల్లలతో కలిసి అమ్మగారి ఇంటి దగ్గరే ఉంటోంది.
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం మల్లయ్యపల్లిలో చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
కోపెళ్లి గ్రామానికి చెందిన సురేష్‌తో... వైష్ణవికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న లక్ష రూపాయలు, 3 తులాల బంగారం ఇచ్చింది. తర్వాత తిరిగి ఇవ్వాలని సురేష్‌ను అడగ్గా... నేను ఇవ్వను, దిక్కున్న చోట చెప్పుకో అన్నాడని... మనస్తాపంతో ఆదివారం పురుగుల మందు తాగింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.