తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య.. - women suicide in bhuvanagiri

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

women suicide in mothkuru in bhuvanagiri district
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య..

By

Published : Oct 10, 2020, 12:17 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో నవిత(22) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. దత్తప్పగూడేనికి చెందిన పనస సత్తయ్య-మంగమ్మ దంపతుల రెండో కుమార్తె నవిత.. అదే గ్రామానికి చెందిన జినుకల నర్సింహ-పుష్పల రెండో కుమారుడు పరశురాములు ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడం వల్ల పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈనెల 2న నవిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన ఆమె మామ, భర్తలు ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె మృతి చెందింది. అత్తింటి వేధింపులు తాళలేకే నవిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. నవిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details