అత్తవారింట్లో మానసిక, శారీరక వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన... సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఎదులబోడు తండాలో చోటుచేసుకుంది. ఎదులబొడు తండాకు చెందిన గుగులోతు మాను, కమ్లీ దంపతుల కూతురు గూగులోతు సరిత (20). తిరుమలగిరి సరస్వతి డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. ఇదే మండలంలోని మర్రికుంట గ్రామ పంచాయతీ పరిదిలోని బోళ్లతండా కు చెందిన భూక్యా నెహృూను... మే 11న ప్రేమవివాహం జరిగింది.
అత్తంటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య - వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన యువతి
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఎదులబోడు తండాలో... వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక... ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
నెహ్రూకి అప్పటికే భూక్యా సరితతో వివాహమైంది. విషయం తెలియక గుగులోతు సరిత నెహ్రును వివాహం చేసుకుంది. పెళ్లైన నాటి నుంచి... మొదటి భార్య భూక్యా సరిత, ఇతర కుటుంబ సభ్యులు గుగులోతు సరితను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. ఓసారి కేశ ముండనం కూడా చేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
ఈ నెల 3న విషయం తల్లిదండ్రులకు చెప్పగా... పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకునేందుకు ఇరు కుటుంబాలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి. డానియేల్ తెలిపారు.