హైదరాబాద్ బీరంగూడలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లు పాపారం గ్రామానికి చెందిన రమేష్-శిరీష వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. మూడేళ్ల క్రితం రమేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి శిరీష.. బీరంగూడలోని తిరుమల ఆస్పత్రి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ... ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది.
తల్లి ఆత్మహత్య.. అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలు - బీరంగూడలో వివాహిత ఆత్మహత్య
భర్త చనిపోయిన బాధలో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన.. హైదరాబాద్ బీరంగూడలో చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
తల్లి ఆత్మహత్య.. అనాథలుగా ముగ్గురు పిల్లలు
భర్త చనిపోయినప్పటి నుంచి జీవితం మీద విరక్తితో పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. బంధువులు, స్నేహితులు నచ్చజెప్పారు. అయినప్పటికీ శిరీష మాత్రం మారలేదు. ఇవాళ మరోసారి ఆత్యహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చివరికి ముగ్గురు చిన్నారులను అనాథలయ్యారు.
ఇవీచూడండి:'ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు'