సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్లగూడెంకు చెందిన గోవింద్ 20 ఏళ్ల క్రితం వచ్చి పటాన్చెరు సాకి చెరువు వద్ద గుడిసె వేసుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు. అతని ముగ్గురు సంతానంలో పెద్ద కుమార్తెకు లింగంపల్లికి చెందిన నాగేష్తో వివాహమైంది. నెలా 15 రోజులక్రితం ఆమె మతిస్థిమితం కోల్పోగా ఆమెను తండ్రి పటాన్చెరుకు తీసుకువచ్చాడు.
ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మతిస్థిమితం లేని యువతి - women suicide due to mental illness at patancheru
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మతిస్థిమితం లేని ఓ యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మతిస్థిమితం లేని యువతి women suicide due to mental illness at patancheru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8631882-425-8631882-1598893404298.jpg)
ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మతిస్థిమితం లేని యువత
కుటుంబసభ్యులందరూ బయట ఉండగా.. శివలీల లోపలికి వెళ్లి గుడిసె పైభాగంలో ఉన్న కట్టెకు చున్నీతో ఉరిపోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెను గమనించిన కుటుంబీకులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
lady suicide at sangareddy