తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఎమ్మెల్యే సీతక్క ముందు పురుగుల మందు తాగిన వివాహిత - చిన్న బోయినపల్లిలో వివాహిత ఆత్మహత్యాయత్నం

తన భర్తతో తనను కలపి.. న్యాయం చేయాలంటూ... ఓ వివాహిత ఎమ్మెల్యే సీతక్క ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లిలో చోటుచేసుకుంది.

women suicide attempt before mla seethakka in chinn aboinapalli
ఎమ్మెల్యే సీతక్క ముందు పురుగుల మందు తాగిన వివాహిత

By

Published : Jul 1, 2020, 8:23 PM IST

ఎమ్మెల్యే సీతక్క ముందు పురుగుల మందు తాగిన వివాహిత

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లిలో ఓ వివాహిత ఆత్యహత్యాయత్నం చేసింది. ఎమ్మెల్యే సీతక్క గ్రామపంచాయతీ ముందు ప్రజలతో మాట్లాడుతుండగా... శివాపురం గ్రామానికి చెందిన మహిళ తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. నా భర్త నాకు కావాలి... నాకు న్యాయం చేయాలని కోరింది. ఆమె చేతిలో ఉన్న డబ్బాను సీతక్క లాక్కుంది. వెంటనే ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.

ఏటూరునాగారానికి చెందిన వావిలాల ముఖేష్​తో కలిసి బాధితురాలు... ఎస్​ఐ ఉద్యోగం కోసం హైదరాబాద్​లో కోచింగ్​ తీసుకునేది. ఆ సమయంలో ఇద్దరు కలిసి రెండు సంవత్సరాలు సహజీవనం చేశారు. అనంతరం 2014లో పోలీసులు సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత కట్నం కావాలంటూ అత్తమామలు వేదించడం ప్రారంభించారు. భర్త కూడా వారితో కలిసి కొట్టేవాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

ఏటూరునాగారంలో పోలీసు స్టేషన్​లో కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో తనను భర్తతో కలపాలని పెద్ద మనుషులను కలుస్తూనే ఉంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క చిన్న బోయినపల్లికి వస్తున్న విషయం తెలుసుకున్న ఆమె... అక్కడకు వెళ్లి గోడు వెల్లబోసుకుంది. సీతక్కతో మాట్లాడుతూనే తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. సీతక్క అనుచరులు బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:ఆగస్టు చివరి వారంలో పార్లమెంట్​ సమావేశాలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details