సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రాజీవ్ చౌక్ వద్ద ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం చేసింది. సిర్గాపూర్ మండలం పోచాపూర్కు చెందిన మహిళ... నారాయణఖేడ్‌కు చెందిన తడ్కల్ వెంకగౌడ్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఆరేళ్లుగా తనపై అత్యాచారం చేశాడంటూ వాపోయింది.
'రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు.. నమ్మించి మోసం చేశాడు' - నారాయణఖేడ్ వార్తలు
ఆర్థికంగా తోడుగా ఉంటానని.. రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆరేళ్లుగా లైంగికంగా కోరికలు తీర్చుకుని ఓ వ్యక్తి మోసం చేశాడని ఆరోపిస్తూ.. మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నారాయణఖేడ్‌లోని రాజీవ్‌చౌక్‌లో చోటు చేసుకుంది.

'రెండో పెళ్లి అన్నాడు.. ఆదుకుంటానని నమ్మించి మోసం చేశాడు'
'రెండో పెళ్లి అన్నాడు.. ఆదుకుంటానని నమ్మించి మోసం చేశాడు'
తనను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి... ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి లోబరుచుకున్నట్లు బాధితురాలు వాపోయింది. ఆరేళ్లుగా తనను వాడుకుని ఇప్పుడు మోసం చేశాడంటూ ఆరోపించింది. ఇప్పటికే సిర్గాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. అయినా వెంకగౌడ్ స్పందించకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పేర్కొంది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని... తన కుమార్తెను ఆదుకోవాలని కోరుతోంది.