తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

న్యాయం చేయాలని.. భర్త ఇంటి ముందు వివాహిత ధర్నా - భర్త మోసం చేశాడని మహిళ ధర్నా

మొదటి పెళ్లి విషయం దాచి.. తనను పెళ్లి చేసుకున్నాడని.. మహిళ ధర్నాకు దిగిన ఘటన ఎస్సార్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మధురానగర్​లో చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం తనను పెళ్లి చేసుకొని.. రెండేళ్లు కాపురం చేసి.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడని  బాధితురాలు ఆరోపించింది.

Women Protest At Front of husband House In SR Nagar
న్యాయం చేయాలని.. భర్త ఇంటి ముందు వివాహిత ధర్నా

By

Published : Oct 4, 2020, 9:12 PM IST

తనను వివాహం చేసుకొని.. పట్టించుకోకుండా వదిలేసిన భర్తపై ఓ మహిళ న్యాయపోరాటానికి చేస్తోంది. భర్తపై వెంటనే చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ.. భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన దివ్యశ్రీకి నగరానికి చెందిన కోట్ల కిరణ్​ కుమార్​తో 2016లో తిరుపతిలో పెళ్లి జరిగింది. రెండేళ్లు దివ్యశ్రీతో కాపురం చేసిన.. కిరణ్​ కుమార్ 2018 నుంచి కనిపించకుండా పోయాడు. భర్త తనని మోసం చేశాడని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

మొదటి పెళ్లి విషయం చెప్పకుండా తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడు పట్టించుకోకుండా రోడ్డు పాలు చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో మహిళా సంఘాలతో పెద్దఎత్తున ధర్నా చేపడుతానని హెచ్చరించింది. దివ్యశ్రీ మౌనదీక్ష విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెతో మాట్లాడి న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. కిరణ్​ కుమార్​పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కసరత్తు ముమ్మరం: 11 అంశాలతో పాసుపుస్తకాలు

ABOUT THE AUTHOR

...view details