మహిళ ప్రాణాల్ని తీసిన వివాహేతర సంబంధం - Woman brutally murdered in Kamareddy district
వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే.. ఆమెను కిరాతకంగా చంపి.. పరారీ అయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
మహిళ ప్రాణాల్ని తీసిన వివాహేతర సంబంధం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో వివాహిత గంగవ్వ(32) హత్యకు గురైంది. వివాహిత సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఆమె ప్రాణాలను తీశాడు. గొడ్డలితో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మహిళను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.