ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం వద్ద వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన దువ్వాడపు చంద్రిక(32), చిలకపాడుకు చెందిన చంటి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల... గత ఆరు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. చంద్రిక గణపవరానికి చెందిన మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది.
ఈ విషయాన్ని తట్టుకోలేని ఆమె మొదటి భర్త ఆమెను చంపేయాలనుకున్నాడు. పథకం ప్రకారం చంటి తన స్నేహితులతో కలిసి పెంటపాడు వస్తున్న చంద్రికను జట్లపాలెంరోడ్డులో అడ్డగించారు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.