యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మేడిపల్లికి చెందిన నాగిల్ల నర్సింహ, భార్య సుమలతతో కలిసి భువనగిరిలోని ఎల్లమ్మ గుడికి వెళ్లారు. అనంతరం పట్టణంలోని ఓ గాజుల దుకాణంలోకి వెళ్లారు. భార్య గాజులు కొనుగోలు చేస్తుండగా.. భర్త కూరగాయలు కొనేందుకు రైతు బజార్ వెళ్లాడు.
భర్త మార్కెట్‌కు వెళ్లొచ్చేలోగా.. అదృశ్యమైన భార్య - women is missing from bhuvanagiri
ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. ఈనెల 9న భర్తతో కలిసి ఎల్లమ్మ గుడికి వెళ్లిన మహిళ అదృశ్యమైంది.
భువనగిరిలో వివాహిత అదృశ్యం
రైతు బజార్‌కు వెళ్లొచ్చే సరికి సుమలత కనిపించలేదు. వెంటనే ఆమె ఫోన్‌కి కాల్ చేయగా.. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఎంత వెతికినా సుమలత ఆచూకీ లభించకపోవడం వల్ల నర్సింహ భువనగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.