తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చేను పని చేసుకుంటున్న మహిళను బలి తీసుకున్న పిడుగు - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

చేను పని చేసుకుంటున్న ఓ మహిళ పిడుగుపాటుకు బలైంది. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా జైనూర్​ మండలంలోని కిషన్​ నాయక్​ తండాలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా... ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు.

women died with thunderstorm in komaram bheem asifabad
women died with thunderstorm in komaram bheem asifabad

By

Published : Sep 26, 2020, 7:17 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం చింతకర్ర పరిధిలోని కిషన్ నాయక్ తండాలో విషాదం చోటుచేసుకుంది. చేను పని చేసుకుంటున్న ఓ మహిళ పిడుగుపాటుకు బలైంది. గ్రామానికి చెందిన లతిత తన అత్త, మామతో కలిసి వారి పత్తి చేనులో పని చేసుకుంటున్నారు. పనిలో నిమగ్నమైన సమయంలో వర్షం కురిసింది. కాసేపు కురిసిన వర్షం ఆగిపోయిన అనంతరం ఒక్కసారిగా పిడుగు పడింది.

ఈ ప్రమాదంలో లలితకు తీవ్రగాయాలు కాగా.. అత్తమామకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని ఎడ్లబండిలో హుటాహుటిన జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఉట్నార్​ తరలించారు. అప్పటికే లలిత మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కిషన్ నాయక్ తండ నుంచి పట్టణాలకు సరైన దారి లేకపోవటం వల్ల లలితను సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయినట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: నక్సల్స్‌ వ్యూహం.. పోలీసుల ప్రతివ్యూహం

ABOUT THE AUTHOR

...view details