తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దాచుకున్న డబ్బులు పాయే... మనస్తాపంతో ప్రాణాలూ పోయే... - money fraud company news

అప్పులు తెచ్చి గొలుసు కట్టు సంస్థలో పెట్టుబడిగా పెట్టి కంపెనీ బోర్డు తిప్పేయటం వల్ల బాధితులు లబోదిబోమంటున్నారు. కొందరు మనస్తాపానికి గురై మంచాన పడితే.. మరికొందరు ప్రాణాలు వదులుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఓ బాధితురాలు గొలుసుకట్టు సంస్థలో డబ్బులు పెట్టి మోసపోగా... మనోవేదనతో అనారోగ్యంపాలై... చివరకు తనువు చాలించింది.

women died with tension for cheated a company
women died with tension for cheated a company

By

Published : Oct 15, 2020, 5:37 PM IST

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దేవవ్వకు గొలుసు కట్టు సంస్థలో డబ్బులు కడితే రెట్టింపవుతాయని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. ఆ మాటలు నమ్మి కొన్నేళ్లుగా కూడబెట్టిన సొమ్ము, అప్పుగా తెచ్చిన డబ్బు మొత్తం కలిపి రూ.లక్షన్నరను బీర్షెబా అనే గొలుసుకట్టు సంస్థకు కట్టింది. కొన్ని నెలలు డబ్బులు రావడం వల్ల సంతోషించింది.

దాచుకున్న డబ్బులూ పాయే... మనస్తాపంతో ప్రాణాలూ పోయే...

తీరా... లాక్​డౌన్ సమయంలో సంస్థ బోర్డు తిప్పేయగా... తీవ్ర మనోవేదనకు గురై కొన్ని రోజులుగా మంచంపట్టింది. పరిస్థితి విషమించగా నేడు ప్రాణం వదిలింది. మృతురాలి బంధువులు బీర్షెబా ఏజెంట్ ఇంటిని ముట్టడించి... దేవవ్వ కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన రైతులు

ABOUT THE AUTHOR

...view details