తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం: ఆమెకిదే చివరి బతుకమ్మ అయ్యింది... - bathukamma celabrations women died

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా ముందు మహిళలు అత్యంత వైభవంగా బతుకమ్మ పండగ జరుపుకుంటారు. అందరి ఇళ్లలో సంతోషాలు నింపితే మేడ్చల్ జిల్లా నిజాంపేట గ్రామంలో మాత్రం విషాదాన్ని మిగిల్చింది.

women died with heart attack after bathukamma celabrations atnizam peta
విషాదం: ఆమెకిదే చివరి బతుకమ్మ అయ్యింది

By

Published : Oct 17, 2020, 6:29 AM IST

బతుకమ్మ ఆడి పాడిన అనంతరం ఇంటికి చేరుకునే క్రమంలో పందిరి వరలక్ష్మి (30) గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట గ్రామంలో జరిగింది. పండుగ రోజు ఆ ఇంటితో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు నెలకొన్నాయి.

ఉదయం నుంచి ఎంతో భక్తితో బతుకమ్మలను పేర్చింది. సాయంత్రం పూట అందరితో కలిసి బతుకమ్మ ఆడి పాడింది. గుండెపోటు రావడంతో ఆమెకు అదే చివరి బతుకమ్మ అయింది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కంటనీరు పెట్టించింది. వరలక్ష్మికి ఒక బాబు, పాప ఉన్నారు.

ఇదీ చూడండి: నీట్​లో తెలుగు విద్యార్థుల సత్తా.. హైదరాబాద్ విద్యార్థినికి మూడో ర్యాంక్​

ABOUT THE AUTHOR

...view details