నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామ శివారులో అద్దంకి నార్కెట్‌పల్లి రహదారిపై దారుణం చోటుచేసుకుంది. మిర్యాలగూడ గాంధీనగర్‌కు చెందిన విజయమ్మ అనే మహిళ... కిష్టాపురం వద్ద మిల్లులో రోజువారి కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. రోజూలాగే పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో... రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది.
రోడ్డు దాటుతుండగా... డీసీఎం ఢీకొని మహిళ మృతి - accident news
రోజులాగే మిల్లులో కూలీకి వెళ్లింది. పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. రోడ్డు దాటేందుకు యత్నించిన ఆమె ప్రయాణం... అక్కడే ముగిసిపోయింది. డీసీఎం రూపంలో వచ్చిన మృత్యువు ఆమె ఆయువు తీసింది.
women died in road accident at narketpally
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విజయమ్మ అకాల మరణంతో కుటంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని... శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.