మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామచంద్రాపురం నుంచి దేవరకద్ర వైపునకు వెళ్తున్న ఆటోను... హైదరాబాద్ నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న మరో ఆటోపైకి కూడా దూసుకెళ్లింది.
ఆటో ఆర్టీసీ బస్సు ఢీ.. మహిళ మృతి - చౌదర్పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి ఓ మహిళ మృతి చెందిన ఘటన... మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్పల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతురాలి పిల్లలకు, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో మహిళ దుర్మరణం
ఈ ఘటనలో మరికల్‌కు చెందిన లక్ష్మి(35) అనే మహిళ మృతి చెందగా... ఆమె ఇద్దరు పిల్లలకు, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని పోస్టుమార్టానికి, క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దేవరకద్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు..