తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తి గ్రామానికి చెందిన మున్నయ్య సత్యవాణి దంపతులు కొడుకు సురేశ్‌తో ఆరు నెలల క్రితం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి వలస వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం పడిన వర్షం కారణంగా ఇటుకలపై పట్టాలు కప్పి తిరిగి వారి గుడిసెలోకి వెళ్తున్న క్రమంలో.. మరో గుడిసె పైకప్పు రేకు గాలికి వేగంగా దూసుకొచ్చి వాళ్ల మీద పడింది.
ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కాగా.. భర్త, కుమారుడు స్వల్పం గాయాలతో బయటపడ్డారు. తోటి కూలీలు వాళ్లను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.