మెదక్ జిల్లా కేంద్రంలోని గోల్కొండ వీధికి చెందిన షేక్ బిస్మిల్లా అనే మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అది గమనించని మహిళ.. ఉదయం వాకిలి శుభ్రం చేస్తున్న క్రమంలో వాటికి తగలడం వల్ల విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.
విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి - latest crime news in medak
విద్యుత్ షాక్‌తో ఓ మహిళ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బిస్మిల్లా మృతి చెందిందంటూ ఫ్యూజ్ ఆఫ్ కాల్ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్ ఘటనా స్థలికి చేరుకుని.. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇవీచూడండి:దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు