నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ డ్యాంలో పడి మహిళ మృతి చెందింది. మృతురాలు మాగనూర్ మండలం నెరడగం గ్రామానికి చెందిన పద్మ(38)గా గుర్తించారు. సోమవారం సాయంత్రం మద్యం సేవించి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
మతిస్థిమితం కోల్పోయి జలాశయంలో పడి మహిళ మృతి - మతిస్థిమితం లేక మహిళ మృతి
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ డ్యాంలో మహిళ మృతదేహం లభించింది. మృతురాలు మాగనూర్ మండలం నెరడగం గ్రామానికి చెందిన పద్మగా గుర్తించారు. కొంతకాలంగా ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబసభ్యులు తెలిపారు.
మతిస్థిమితం కోల్పోయి జలాశయంలో పడి మహిళ మృతి
మంగళవారం నాడు డ్యాంలో పద్మ మృతదేహం కనిపించిందన్నారు. మృతురాలు కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయిందని తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:మనుషులపై అమెరికా సంస్థ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్