సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కట్టెనుకగూడ వాటర్ ట్యాంకులో దాదాపు 35 సంవత్సరాల వయసు కలిగిన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.
మంచి నీటి ట్యాంకులో ఓ మహిళ మృతదేహం లభ్యం - women dead body found in water tank
మంచి నీటి ట్యాంకులో ఓ మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని... దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
sangareddy district latest news
దుర్వాసన రావడం వల్ల వెళ్లి చూసేసరికి మతృదేహం కనిపించిందని స్థానికులు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం నీటి ట్యాంక్ శుభ్రం చేసినట్లు చెప్పారు. ఆసమయంలో ఎలాంటి మృతదేహం కనిపంచలేదన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు.