వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె కొడుకు తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టడుతున్నాడు. హన్మకొండలోని ట్రైలర్ స్ట్రీట్లో నివాసముండే శారద... విభేదాల కారణంగా భర్తతో విడిపోయి... కొడుకుతో కలిసి ఉంటోంది.
మహిళ దారుణ హత్య... చావుబతుకుల మధ్య కొడుకు - హన్మకొండ వార్తలు
విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ దారణ హత్యకు గురైంది. ఆమె కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![మహిళ దారుణ హత్య... చావుబతుకుల మధ్య కొడుకు women-brutally-murder-in-hanamkonda-at-warangal-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8659720-thumbnail-3x2-murder.jpg)
మహిళ దారుణ హత్య... కొడుకుకు తీవ్రగాయాలు
కూరగాయలు అమ్ముకుంటూ... జీవనం సాగిస్తున్న ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుమారుడు తీవ్రగాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి