సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్లో ఓ మహిళ(42) దారుణ హత్యకు గురైంది. మహిళను కిరాతకంగా దుండగులు నరికి చంపారు. మొండెంను గ్రామంలో పడేసిన హంతకులు నారాయణఖేడ్ పట్టణంలో ఓ ఇంటి వద్ద తలను వదిలి వెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయోత్పాతానికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళను భర్తే చంపినట్లు... పోలీసులు అనుమానిస్తున్నారు.
తల ఒకచోట.. మొండెం మరోచోట.. అతికిరాతకంగా మహిళ హత్య - Telangana crime news
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. తలను, మొండెంను వేరు చేసి.. వేరు ప్రదేశాల్లో పడేశారు.

మహళ దారుణ హత్య... తలను, మొండెంను వేరు చేసి...