యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డు సమీపంలో అర్ధరాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. మృతురాలు జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దమడుగుకు చెందిన బోలు లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తున్నారు.
లక్ష్మి భర్త 15 ఏళ్ల కింద మరణించాడు. బతుకు దెరువు కోసం పిల్లలతో హైదరాబాద్ వెళ్లింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసుకుంటూ జీవనం సాగించేది. 2017లో అదే గ్రామానికి చెందిన ఆర్య కుమార్గౌడ్తో పరిచయం అయింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. గత కొద్ది నెలలుగా వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో గొడవ జరుగుతోందని పేర్కొన్నారు.