తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వివాహిత ఆత్మహత్య... హత్యేనంటూ కుటుంబసభ్యుల ఆందోళన

రంగారెడ్డి జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలలే హత్యచేశారని బంధువులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

suicide
suicide

By

Published : Jul 20, 2020, 1:57 PM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని హర్షగూడలో రోజా(25) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన రోజాతో హర్షగూడకు చెందిన వీరేష్​తో 2017లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా దంపతులు గొడవ పడుతున్నారు. పలుమార్లు బంధువులు నచ్చజెప్పారు.

ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోజా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రోజా తల్లిదండ్రులు, బంధువులు హర్షగూడకు చేరుకుని రోజా భర్త, అత్తమామలే హత్య చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

ఇదీ చదవండి:నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!

ABOUT THE AUTHOR

...view details