మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల పరిధిలోని ఫతేపూర్ గ్రామసమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఫతేపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మహిళ మృతదేహాన్ని గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.
ఫతేపూర్ అటవీ ప్రాంతంలో మహిళ దారుణ హత్య - women was killed in mahabubnagar
రెండ్రోజులుగా కనిపించకుండా పోయిన మహిళ ఫతేపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో విగతజీవిగా కనిపించిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్లే వాహనదారులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఫతేపూర్ అటవీ ప్రాంతంలో మహిళ దారుణ హత్య
మహిళ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. రుద్రారం గ్రామానికి చెందిన చంద్రకళగా గుర్తించారు. రెండ్రోజుల నుంచి చంద్రకళ కనిపించడం లేదని ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. రుక్కంపల్లికి చెందిన హనుమయ్యపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేయగా.. అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.