తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పది నెలల క్రితం పెళ్లి... వివాహిత అనుమానస్పద మృతి! - తెలంగాణ వార్తలు

పెళ్లైన పది నెలలకే ఓ వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. జవాన్​గా పనిచేసే భర్త సెలవులపై ఊరికి రాగా... భార్యభర్తలకి గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆపై ఆమె మృతి చెందిందని సమాచారం ఇచ్చారు. ఆమె భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

woman-suspected-death-at-vepoor-in-mahabubnagar-district
పది నెలల క్రితం వివాహం... వివాహిత ఆత్మహత్య!

By

Published : Jan 13, 2021, 8:47 PM IST

మహబూబ్​నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో ఓ వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అనూషకు... హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి చెందిన సాయితో 10 నెలల క్రితం వివాహమైంది. జవాన్​గా పని చేసే సాయి... సెలవులపై నాలుగు రోజుల క్రితం కూచూరు గ్రామానికి వచ్చారు.

వేపూరు గ్రామానికి వచ్చిన దంపతులు మంగళవారం రాత్రి గొడవపడినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆత్మహత్య చేసుకొని అనూష మృతి చెందిందని... మృతురాలి బంధువులు సమాచారమిచ్చారు. తమ కూతురుని అల్లుడే కొట్టి చంపాడని అనూష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ముగిసిన అఖిలప్రియ కస్టడీ.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు

ABOUT THE AUTHOR

...view details