తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమిస్తున్నాననే వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య!

ప్రేమిస్తున్నాననే వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆరు నెలల నుంచి ఓ యువకుడు వేధిస్తుండడం వల్ల ఉరి వేసుకొని బలవన్మరణానికి యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

woman-suicide-with-harassment-of-love-at-kothapet-in-warangal-rural-district
ప్రేమిస్తున్నాననే వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

By

Published : Jan 11, 2021, 8:03 PM IST

ప్రేమిస్తున్నాననే వేధింపులు భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో ఇసంపల్లి రాజేష్ అనే యువకుడు... అదే గ్రామానికి చెందిన అర్చనను ఆరు నెలలుగా ప్రేమ పేరుతో వెంట పడుతూ వేధింపులు గురి చేస్తున్నాడని మృతురాలి బంధువులు తెలిపారు. ఆ వేధింపులు భరించలేకే అర్చన ఈనెల 6న ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిందని అన్నారు. అది చూసిన ఆమె సోదరుడు హుటాహుటిన అర్చనను ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

చికిత్స పొందుతూ అర్చన సోమవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజబాబు తెలిపారు.

ఇదీ చదవండి:భాజపా, తెరాస మధ్య చీకటి ఒప్పందం: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details