మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధి పాపిరెడ్డి నగర్లో విషాదం జరిగింది. ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. సురారం ప్రాంతానికి చెందిన సుజాతకు... జగద్గిరిగుట్టకు చెందిన సంతోష్ కుమార్తో నెలన్నర క్రితం వివాహమైంది. సంతోష్ ద్విచక్రవాహనంపై వస్త్రాలు విక్రయిస్తూ ఉంటాడు.
ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య - ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరి గుట్ట ఠాణా పరిధి పాపిరెడ్డి నగర్లో జరిగింది. నెలన్నర క్రితం వివాహమైన సుజాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య
మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో.. సుజాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు