తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సీఏలో అర్హత పొందలేదని యువతి ఆత్మహత్య - సీఏ విద్యార్థి ఆత్మహత్య

మూడుసార్లు సీఏ పరీక్ష రాసింది ఓ యువతి. అర్హత సాధించలేదు. నాల్గోసారి రాయడానికి సన్నద్దం అవుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాననే మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌ ముషీరాబాద్‌కు చెందిన స్వప్న జైన్‌ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

woman suicide at musheerabad in hyderabad
సీఏలో అర్హత పొందలేదనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య

By

Published : Oct 12, 2020, 9:41 AM IST

హైదరాబాద్‌ ముషిరాబాద్‌లో విషాదం జరిగింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నాననే మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాంనగర్‌కు చెందిన స్వప్న జైన్ మూడుసార్లు చార్టెడ్ అకౌంట్ పరీక్ష రాసినా ఎంపిక కాలేదు. నాల్గోసారి పరీక్షకు సిద్ధమవుతూ తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:రోడ్డు దాటుతుండగా వ్యక్తిని ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి

ABOUT THE AUTHOR

...view details