నాగర్‌కర్నూలుకు చెందిన రేష్మా, శివుడు ఏడాదిన్నర క్రితం యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. కరోనా ప్రభావంతో లాక్డౌన్ కారణంగా సొంత గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు మరొక అమ్మాయితో పెళ్లి చేసేందుకు సన్నాహాలు చేశారు.
అదనపు కట్నం కోసం మరో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ధర్నా - నాగర్‌కర్నూలులో మహిళ ధర్నా
ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ ఏడాదిన్నర వరకు తనతో ఉండి... అదనపు కట్నం కోసం మరో వివాహానికి సిద్ధపడ్డ ప్రియుని ఇంటి ముందు మహిళ ఆందోళనకు దిగిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
అదనపు కట్నం కోసం మరో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ధర్నా
విషయం తెలుసుకున్న రేష్మా... 15 రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి తమ పెళ్లి విషయం తెలిపింది. ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చివరకి తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
ఇదీ చదవండిః'అప్పటివరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు'