తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'దారుణంగా హత్య చేసి... శరీర భాగాలను విడివిడిగా పడేసి' - రాందాస్ పల్లిలో మహిళ హత్య

రంగారెడ్డి జిల్లా రాందాస్ పల్లిలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. కిరాతకంగా హతమార్చిన దుండగుడు మహిళ శరీర భాగాలను విడివిడిగా పడేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

'దారుణంగా హత్య చేసి... శరీర భాగాలను విడివిడిగా పడేసి'
'దారుణంగా హత్య చేసి... శరీర భాగాలను విడివిడిగా పడేసి'

By

Published : Sep 30, 2020, 8:33 AM IST

ఓ మహిళను దారుణంగా హత్య చేసి శరీర భాగాలను విడివిడిగా పడేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాందాస్ పల్లిలో చోటుచేసుకుంది. ఆదివారం వనస్థలిపురంలో మిస్సింగ్ కేసు నమోదైన బొమ్మరాజ మైసమ్మగా గుర్తించారు. మృతురాలు సాహెబ్ నగర్ వాసిగా తేల్చారు.

5 తులాల బంగారు ఆభరణాలు, 100 తులాల వెండి ఆభరణాలు మృతురాలి శరీరంపై ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆభరణాల కోసమే హత్య జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం ఏసీపీలు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ఖరీఫ్‌ ధాన్యం లక్ష్యాల ప్రకారం మూడో స్థానంలో తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details