సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సంగారెడ్డి మండలంలోని ఫసల్వాది గ్రామ శివారులో ఎంఎన్ఆర్ చెరువు కట్ట కింద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య! - సంగారెడ్డి జిల్లా నేర వార్తలు
సంగారెడ్డి జిల్లా ఫసల్వాది శివారులోని ఎంఎన్ఆర్ చెరువు వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి... హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య!
మహిళ వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుందని... మహిళను అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.