వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవపూర్ శివారులోని పొదల్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు రాఘవపూర్ గ్రామానికి చెందిన బాలమణిగా గుర్తించారు.
మహిళ అదృశ్యం .. అనుమానాస్పద స్థితిలో మృతి - Vikarabad district crime news
ఆసుపత్రికి వెళ్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ.. రెండు రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
విషాదం: అదృశ్యమైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి
ఆసుపత్రికి వెళ్తానని చెప్పి శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన బాలమణి.. ఎంతకీ తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు శనివారం రాత్రి పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈరోజు రాఘవపూర్ శివారులోని పొదల్లో బాలమణి శవాన్ని గుర్తించారు. మృతికి గల కారణాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చూడండి.. 'వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి'