తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో పెచ్చులు మీదపడి గర్భిణీ మృతి - తిరుపతి స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రి వార్తలు

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో పెచ్చులూడిపడి ఓ గర్భిణీ మృతి చెందింది. మృతురాలు ఆసుపత్రిలో పనిచేసే అటెండర్‌ రాధిక అని పోలీసులు తెలిపారు.

woman-dies-of-scabies-at-svims-covid-hospital
ఏపీ: స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో పెచ్చులు మీదపడి గర్భిణీ మృతి

By

Published : Oct 5, 2020, 2:51 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి సిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న దిమ్మెల పెచ్చులు ఊడిపడిన ఘటనలో ఆరునెలల గర్భిణీ మృతి చెందడం విషాదాన్ని నింపింది. స్విమ్స్‌ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డ్‌ పైఅంతస్తులో నూతనంగా నిర్మాణాలు చేపట్టారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా నిర్మాణపు దిమ్మెలు, పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న అటెండర్‌ రాధిక తీవ్రగాయాలై మృతి చెందింది. మరో ఇద్దరు కొవిడ్‌ రోగులకు గాయాలయ్యాయి.

ఏపీ: స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో పెచ్చులు మీదపడి గర్భిణీ మృతి

ఆరు నెలల గర్భిణీగా ఉన్న రాధిక.. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా స్వచ్చందంగా వచ్చి విధులు నిర్వహిస్తోంది. అలాంటిది ఈ ప్రమాదం జరిగి ఆమె మృతి చెందడం కుటుంబసభ్యులతో పాటు సహోద్యోగుల్లోనూ తీరని విషాదాన్ని నింపింది. సంఘటనా స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్ వీరబ్రహ్మం, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్‌ రెడ్డి పరిశీలించారు.

ఇదీ చదవండి...కాల్వలోకి దూసుకుపోయిన కారు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details