భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం బాటన్న నగర్లో విషాదం చోటు చేసుకుంది. పశువులను మేతకి తీసుకెళ్లిన మాడే ఎర్రమ్మ అనే మహిళ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
పశువుల మేతకి వెళ్లి విద్యుదాఘాతంతో మహిళ మృతి
పశువులను మేతకి తీసుకెళ్లిన ఓ మహిళ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. కరెంట్ తీగలు చెట్లకు తగిలి ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.
పశువులను మేతకి తీసుకెళ్లిన మహిళ... విద్యుదాఘాతంతో మృతి
హైటెన్షన్ తీగలు చెట్లకు తగిలి ఉండడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. రోజూలాగే పశువులను మేతకి తీసుకెళ్లిన మహిళ ఆకస్మిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి:ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి