సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో కూరగాయలు తీసుకునేందుకు దేవి అనే మహిళ వెళ్లింది. జాతీయ రహదారి పక్కన ఉన్న కూరగాయలు తీసుకుంటుండగా జహీరాబాద్ నుంచి పటాన్చెరు వైపు వస్తున్న టవేరా వాహనం అదుపు తప్పి కూరగాయల దుకాణం వైపు దూసుకొచ్చి.. పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.
ప్రమాదం.. వాహనం ఢీకొని మహిళ దుర్మరణం - Road accident in Sangareddy district
వాహనం అదుపుతప్పి మహిళను ఢీకొట్టడంతో దుర్మరణం పాలైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రుద్రారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
ప్రమాదం.. వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
అక్కడే కూరగాయలు కొనుగోలు చేస్తున్న దేవి అనే మహిళను ఢీకొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
- ఇవీ చూడండి:తెలంగాణలో జలాశయాల సామర్థ్యం 878 టీఎంసీలు..