కర్ణాటక రాష్ట్రం కలబురిగి పట్టణం నుంచి శ్రీదేవి (45) కొన్నేళ్ల క్రితం కాళ్లకల్‌కు వచ్చి దాబాలో పాచిపని చేసుకుంటూ అక్కడే ఉంటూ జీవనం సాగిస్తోంది. లాక్‌డౌన్‌తో దానిని మూసేశారు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. చేయడానికి పని కరవైంది. తినడానికి తిండి దొరకలేదు. ఒకరోజు తింటే రెండు రోజులు పస్తులు ఉండేది. ఈ క్రమంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మంచం పట్టి.. చివరికి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది.
కరోనా ఎఫెక్ట్... ఆహారం దొరక్క మరో ప్రాణం బలి.. - కర్ణాటకలో ఆకలితో ఓ మహిళ మృతి
కరోనా రక్కసి పరోక్షంగా మరో ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. ఆకలితో అలమటించి ఓ మహిళ కృశించి చనిపోయింది. ఈ ఘటన మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో జరిగింది. అసలేం జరిగిందంటే..?

కరోనా రక్కసికి... పరోక్షంగా మరో ప్రాణం బలి..