సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో లక్ష్మి అనే మహిళ ఇంటివద్ద ఓ గుంత తవ్వారు. దాని కోసం ఓ విద్యుత్ బల్బును శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున తీగతో సహా బల్బును తీసేందుకు లక్ష్మి ప్రయత్నించింది. విద్యుత్ సరఫరా ఉండగా తీగ తీయడం.. మరోవైపు తీగకు తడి ఉన్నందున ఆమెకు షాక్ కొట్టింది.
పటాన్చెరులో విద్యుదాఘాతంతో మహిళ మృతి - పటాన్చెరులో విద్యుదాఘాతంతో మహిళ మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో విద్యుత్ తీగ తీయబోయి లక్ష్మీ అనే మహిళ విద్యుదాఘాతంతో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి దర్యాప్తు చేస్తున్నారు.
పటాన్చెరులో విద్యుదాఘాతంతో మహిళ మృతి
కుటుంబసభ్యులు ఆమెను వెంటనే పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే లక్ష్మి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
women dead