అనుమానాస్పద స్థితిలో జయమ్మ అనే మహిళ మృతి చెందిన ఘటన సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలు సికింద్రాబాద్‌లో గల రేతిఫైల్ బస్టాప్ వద్ద స్వీపర్‌గా పని చేసేదని పోలీసులు వెల్లడించారు.
కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం - హైదరాబాద్ వార్తలు
ఓ బస్టాప్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోన్న మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇంట్లోనే కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఆమె కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్ ప్రాంతానికి చెందిన జయమ్మ తన భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా కుళ్లిన స్థితిలో జయమ్మ మృతదేహం లభ్యమైంది. ఆమె మూడు రోజుల క్రితం మరణించినట్లుగా గుర్తించిన అధికారులు పలు ఆధారాలను సేకరించారు. తన తల్లి మరణం పట్ల జయమ్మ కూతురు సంధ్య అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:అగ్రిగోల్డ్ ఛైర్మన్ సహా ముగ్గురు అరెస్ట్