తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భర్త వేధింపులు.. భార్య బలవన్మరణం - జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివాహిత ఆత్మహత్య

అనుమానం పెనుభూతంగా మారి భార్య మృతికి కారకుడయ్యాడు ఓ భర్త. నిత్యం భార్యను అనుమానిస్తూ వరకట్న వేధింపులతో వేధిస్తూ చివాట్లు పెడుతూ పొట్టనపెట్టుకున్నాడు. ఆ బాధలు భరించలేక మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి ఓ వివాహిత ఒంటిపై డిజిల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

woman-committed-suicide-in-chelpur-village
woman-committed-suicide-in-chelpur-village

By

Published : Dec 31, 2020, 2:56 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో మూడేళ్లుగా ఓ అద్దె ఇంట్లో భార్య భర్తలు నీరటి రోజా, రాజ్ కుమార్ నివాసముంటున్నారు. రాజ్​ కుమార్​ జేసీబీ డ్రైవర్​గా పనిచేశాడు. అయితే రోజాకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రోజు ఆమెను వేధించేవాడు. అంతే కాకుండా తనకు అదనపు కట్నం కావాలని, కట్నం ఇస్తేనే తన తల్లిదండ్రులతో మాట్లాడాలని ఇబ్బదులకు గురిచేసేవాడు.

ఈ నేపథ్యంలో రోజా.. సూసైడ్​ నోట్ రాసి ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిది వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆస్తి తగాదాల్లో అన్నను చంపిన తమ్ముడు

ABOUT THE AUTHOR

...view details