రెవెన్యూ అధికారులు అన్యాయం చేశారంటూ.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగింది. మెట్లగూడెం గ్రామానికి చెందిన కోరం వీరభద్రమ్మ తన భూమిని వేరేవారి పేరు మీద పట్టా చేశారని ఆరోపించింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం - తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారులు తమ భూమిని ఇతరుల పేరిట పట్టాచేశారని ఆరోపిస్తూ... ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.
1982లో తన తండ్రి 8ఎకరాల 32 గుంటల భూమి కొనుగోలు చేశారని... అప్పటి నుంచి తామే సాగు చేసుకుంటున్నామని బాధిత మహిళ కుమారుడు తెలిపాడు. రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తి పేరు మీద 5 ఎకరాల 32 గుంటలు పట్టా చేశారని వాపోయాడు. తాము వారి దృష్టికి తీసుకువెళ్తే సరి చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారని... తిరిగి తిరిగి విసిగిపోయి ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధిత మహిళ వాపోయింది. రెవెన్యూ అధికారులు లంచం తీసుకుని తమకు అన్యాయం చేశారని ఆరోపించింది.
ఇవీ చూడండి: ధర్నాకు దిగిన తీలేరు వాసులు.. కలెక్టర్ హామీతో విరమణ