తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మాంసం కొట్టే కత్తితో మహిళ దారుణ హత్య - Bhadradri district crime news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం చోటుచేసుకుంది. మాంసం కొట్టే కత్తితో మహిళను దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Woman brutally murdered with a meat knife in Bhadradri district
మాంసం కొట్టే కత్తితో మహిళ దారుణ హత్య

By

Published : Aug 8, 2020, 10:27 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ మహిళ హత్యకు గురైంది. పోలీస్​స్టేషన్​కు కూతవేటు దూరంలో జరిగిన హత్యతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి.

అంబేద్కర్​కూడలిలోని మహబూబ్​బాషా, హాబీబున్నిసా దంపతులు మాంసం దుకాణం నిర్వహిస్తున్నారు. హాబీబున్నిసా రోజులాగే పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న వీధి నుంచి సరఫరా అయ్యే నీటిని తెచ్చుకునేందుకు శనివారం పంపు వద్దకు వెళ్లింది. ఒక బిందెతో నీటిని మోసుకెళ్తున్న తరుణంలో ఓ ఆగంతకుడు వెనుక నుంచి వచ్చి మాంసం కొట్టే కత్తితో హాబీబున్నిసా మెడపై వేటు వేశాడు. ఆ దెబ్బకు కుప్పకూలిపోయిన హాబీబున్నిసా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది. హాబీబున్నిసా హత్యకు వినియోగించిన కత్తిని ఆగంతకుడు దగ్గర్లోని చెట్ల పొదల్లో వేసి పరారయ్యాడు. విగతజీవిగా పడి ఉన్న హబీబున్నిసాని చూసి భర్త, ముగ్గురు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ శభరీష్, సీఐ షూకూర్​లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హాబీబున్నిసానిని హత్య చేసింది దగ్గరి బంధువని పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు విస్తృతంగా గాలించారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు, క్లూస్ టీమ్ ఆధారంగా ఆగంతకుడి పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:కేరళ విమాన ప్రమాద దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details