తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పాల ప్యాకెట్లు వేసేందుకు వస్తోంది... ఇల్లు చక్కబెట్టేస్తోంది! - పాల ప్యాకెట్లు వేస్తూ దొంగతనం చేస్తున్న మహిళ అరెస్టు

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో పాల ప్యాకెట్లు వేస్తూ ఇళ్లలో దొంగతనం చేస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద రూ.47 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Woman arrested for stealing milk packets at guntur
'పాల ప్యాకెట్లు వేస్తూ దొంగతనం చేస్తున్న మహిళ అరెస్టు'

By

Published : Sep 8, 2020, 4:06 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో పాల ప్యాకెట్లు వేస్తున్న నెపంతో దొంగతనం చేస్తున్న మహిళను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలక్ష్మి వద్ద నుంచి రూ.47 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పాత గుంటూరుకు చెందిన కుడుముల శ్రీలక్ష్మి కుటుంబ పోషణ, ఆర్దిక అవసరాలు కోసం దొంగతన్నాన్ని వృత్తిగా ఎంచుకుంది. గత 4 సవంత్సరాల నుంచి గుంటూరు నగరంలో చిన్న చిన్న దొంతనాలు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఉదయం పూట పాల ప్యాకెట్, ఇవ్వడానికి వచ్చినట్లు వచ్చి ఇంటిలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దొంగలిస్తుందని పోలీసులు తెలిపారు.

నిందితురాలు శ్రీలక్ష్మి పైన గతంలో పాత గుంటూరు, నగరంపాలెం పోలీస్ స్టేషన్ లలోనూ కేసులు నమోదైనట్లు పట్టాభిపురం సీఐ పూర్ణచంద్రరావు వివరించారు. తెల్లవారుజామున పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణనగర్ ప్రాంతంలో ఓ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి లోకి ప్రవేశించి 52, 600 నగదును దొంగతనం చేయడం జరిగిందని.. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

ఇదీ చదవండి: అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారు..

ABOUT THE AUTHOR

...view details