ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ వైన్ షాపులో దొంగతనం జరిగింది. చోరి జరిగిన విషయం పోలీసులు షాపు యజమానికి తెలియజేయడంతో అవాకయ్యాడు షాపు ఓనర్.
వేసిన షెటర్ వేసినట్లే ఉంది.. కానీ షాపులో మద్యం మాత్రం మాయమైంది. పక్కా ప్రణాళికతో నిన్న రాత్రి వైన్ షాపులో ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసులు వెంబడించారు. వారిలో ఒకరిని పట్టుకున్నారు. వెంటనే యజమానికి ఫోన్ చేసి పోలీసులు సమాచారం ఇచ్చారు.