తప్పుడు ప్రచారాలు నమ్మి వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ హెచ్చరించారు. అక్రమంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా వన్యప్రాణులను వేటాడుతున్న ఎనిమిది మంది సభ్యులు గల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి ఎనిమిది చరవాణులు, మూడు బైకులు, కత్తి, అలుగు జంతువును స్వాధీనం చేసుకున్నారు. వీరిని జిల్లాలోని కాశిపేట మండలం సండ్రపేట వారిగా గుర్తించారు.
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్.. అలుగు స్వాధీనం - అలుగు జంతువును వేటాడుతున్న వారి అరెస్ట్
అధికంగా డబ్బులు వస్తాయన్న దురాశతో వన్యప్రాణులను వేటాడుతున్న ముఠాను మంచిర్యాల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారివద్ద నుంచి ఎనిమిది చరవాణులు, మూడు ద్విచక్రవాహనాలు, కత్తి, అలుగు జంతువును స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాలలో వేటగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు
క్యాన్సర్ వ్యాధి నివారణకు అడవి అలుగు జంతువు పోలుసు వాడుతారని తప్పుడు ప్రచారాన్ని నమ్మి బెల్లంపల్లి ఫారెస్ట్ ఏరియాలో ముఠా వన్యప్రాణులను వేటాడుతున్నారు. వీటికి చైనా మార్కెట్‌లో భారీ ధర పలుకుతుందన్న అసత్య ప్రచారంతో ముఠాగా ఏర్పడి అటవీ జంతువులను హింసిస్తున్నారు. ఎవరైనా అటవీ జంతువులను పట్టుకున్నా, హాని తలపెట్టినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. అనంతరం నిందితులను, అలుగు జంతువును అటవీశాఖ అధికారులకు అందజేశారు.