తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భర్త హత్య.. భార్యే చంపిందిందా.? - పటాన్​చెరులో భర్త హత్య

భార్యాభర్తలిద్దరూ పిల్లలను ఇంటి వద్ద వదిలి ఎంపీడీవో కార్యాలయానికని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో భర్త హత్యకు గురయ్యాడు. దానితో మృతుడి బంధువులు... భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?

wife suspect in husband murder case at sangareddy district patancheru
భర్త హత్య.. భార్యే చంపిందిందా.? లేక ఎవరైనా చంపారా?

By

Published : Oct 27, 2020, 12:49 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానూరుకు చెందిన మంగలి సత్యనారాయణ, మనీలా దంపతులు. సత్యనారాయణకు ఎనిమిది నెలలు కిందట పక్షవాతం వచ్చి ఇంటి వద్దే ఉంటున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తలిద్దరూ సోమవారం పిల్లలను ఇంట్లో విడిచిపెట్టి ఎంపీడీవో కార్యాలయానికని వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో రేణుకాఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద ఇద్దరూ ఆగారు. కొద్దిసేపటికి సమీపంలో ఉన్న కాలువలో సత్యనారాయణ తీవ్రగాయాలతో చనిపోయి ఉన్నాడు.

ఇంతకీ ఏం జరిగింది?

తన భర్త స్నేహితులు వచ్చారని.. మందు తాగుదాం అని దూరంగా తీసుకెళ్లి కత్తులతో బెదిరించి హత్య చేసి.... కాలవలో పడేేశారని మనీలా చెబుతోంది. అయితే మృతుని బంధువులు మాత్రం భార్యే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమెపై దాడి చేశారు. భార్యాభర్తలకు కొంత కాలంగా గొడలవుతున్నాయని బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె చెప్పిందానికి అక్కడ జరిగిన సంఘటన పొంతన లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనీలాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి:షేర్‌చాట్‌లో స్కిట్‌ కోసం బాలుణ్ని బలిచేసిన బిహార్‌​ వాసి

ABOUT THE AUTHOR

...view details