తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు! - ap latest crime news

ఒక మహిళ అసహజ కోరికలు భర్త ప్రాణాలు తీశాయి. అవమాన భారంతో ఆత్మహత్యకు పురిగొల్పాయి. రెండు అంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడేలా చేశాయి. సమాజమే సిగ్గు పడేలా ఆ మహిళ సాగించిన అసహజ శృంగారం.. చివరికి భర్త ప్రాణాలనే బలితీసుకున్న ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది.

wife-sexual-desires

By

Published : Nov 8, 2019, 9:59 AM IST

Updated : Nov 8, 2019, 2:23 PM IST

భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!

భార్య చేసిన పనికి సిగ్గుపడి.. అవమానభారంతో ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఒంగోలు మారుతీ నగర్​లోని ఓ భవనం రెండో అంతస్తులో ఏడుకొండలు, సుమలత దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఏడుకొండలు ఆటో నడుపుతూ, నూడిల్స్ బండి పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుమలత గృహిణి.

ఇంటి దగ్గరే ఉండే ఆమె... తనకు పరిచయమున్న కళాశాల విద్యార్థినులకు మాయ మాటలు చెప్పి లోబర్చుకోవడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా... ఆన్​లైన్ షాపింగ్ ద్వారా సెక్స్ టాయ్స్ ఇంటికి తెప్పించుకుంది. మగవాడి వేషధారణ ధరించి సెక్స్ టాయ్స్ ఉపయోగించి బాలికలతో విశృంఖల శృంగారం చేస్తుండేది. సుమలత అసహజ శృంగారాన్ని భరించలేని జరుగుమల్లికి చెందిన ఓ బాలిక... జిల్లా ఎస్పీకి 'స్పందన' కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సుమలత వ్యవహారంపై దృష్టి పెట్టారు. మారుతీ నగర్​లోని ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేశారు.

సుమలత భర్త ఏడుకొండలు సమక్షంలోనే ఇంట్లో సోదాలు చేయగా... భర్తకు విస్తుపోయే వస్తువులు కనిపించాయి. ఇంట్లోని ఒక సంచిలో దాచి ఉంచిన పలు రకాల సెక్స్ టాయ్స్ బయటపడ్డాయి. ఈ అవమాన భారం భరించలేని భర్త ఏడుకొండలు.. రెండో అంతస్తులోంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని పోలీసులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుకొండలు చనిపోయాడు. అనంతరం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించిన పోలీసులు శవ పంచనామా పూర్తి చేశారు. ఈ ఘటనకు కారణమైన మహిళ సుమలతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి:ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?

Last Updated : Nov 8, 2019, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details