భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అలుబాక గ్రామానికి చెందిన సుభాశ్ అనే కానిస్టేబుల్‌కి మణుగూరు మహిళతో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలైన తర్వాత సంవత్సరం నుంచి మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
లాడ్జ్గదిలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భర్త... దేహశుద్ధి చేసిన భార్య - కానిస్టేబుల్ అక్రమ సంబంధం తాజా వార్త
ఎంతో బాధ్యత కలిగిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ భార్య ఉండగా మరొక మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య లాడ్జ్గదిలో వేరేమహిళతో ఉన్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది.
![లాడ్జ్గదిలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భర్త... దేహశుద్ధి చేసిన భార్య wife registered a police case against a constable who had an illicit affair in Bhadradri Kothagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9225454-478-9225454-1603038271687.jpg)
లాడ్జ్గదిలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భర్త... దేహశుద్ధి చేసిన భార్య
కాగా విషయం తెలుసుకున్న సుభాశ్ భార్య... భర్త భద్రాచలంలోని ఓ ప్రైవేటు లాడ్జి గదిలో ఓ మహిళతో ఉన్నాడని తెలుసుకుని కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుంది. ఇద్దరిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించి, వివాహేతరబంధం పెట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి:పెళ్లైన ఆరునెలలకే వివాహిత ఆత్మహత్య